కన్యాదాన్, మిషన్ లైలా, హిసాబ్ బరాబర్ వంటి చిత్రాలతో పాటు ఉత్తరన్, దిల్ సే దిల్ తక్ వంటి పలు టీవీ షోల తో మంచి క్రేజ్ ని పొందిన నటి రష్మీ దేశాయ్.భోజ్‌పురి, ఇంగ్లీష్, గుజరాతీ,ఉర్దూ భాషలకి చెందిన పలు సినిమాల్లోను నటించి తన సత్తా చాటింది.
రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ దురదృష్టవ శాత్తు కెరీర్ ప్రారంభంలోనే నేను కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నాను.అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు.ఒక రోజు ఆడిషన్ కి పిలిస్తే చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళాను.కానీ అక్కడ ఒక వ్యక్తి తప్ప ఎవరు లేరు.కెమెరా కూడా లేదు.నా డ్రింక్ లో డ్రగ్స్ వేసి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి అనుభవించాలని శాయశక్తులా ప్రయత్నించాడు.ఇదంతా వద్దు అని అరుస్తూ అక్కడ్నుంచి ఎలాగోలా బయటపడ్డాను.
ఆ తర్వాత ఇంటికొచ్చి జరిగందంతా మా అమ్మకి చెప్పాను. దాంతో మరుసటి రోజు మా అమ్మ నేను ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాం.అప్పుడు మా అమ్మ అతన్ని కొట్టినట్టు గుర్తు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది మాత్రం ఉంది. కాకపోతే మంచి, చెడు అనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయని చెప్పుకొచ్చింది.